మొక్కలు నాటడం సామాజిక బాధ్యత
NEWS Aug 18,2026 08:24 pm
విద్యార్థులు మొక్కలను దత్తత తీసుకొని సంరక్షించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని వృక్షో రక్షతి రక్షితః అనే భావనతో మొక్కలను కాపాడితే అవే మనలను కాపాడుతాయని పేర్కొన్నారు.