పర్యావరణ పరిరక్షణ ఉపన్యాస పోటీ
NEWS Aug 18,2026 08:28 pm
మక్తల్: ఎం.జే.పీ.వి.సీ మక్తల్ అసెంబ్లీ మహిళా విభాగం అధ్యక్షురాలు యాంకే పద్మ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. పలు పాఠశాలలను సందర్శించి పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను వివరించారు. ఈ నెల 30న మక్తల్‌లో నిర్వహించనున్న పర్యావరణ పరిరక్షణ ఉపన్యాస పోటీల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యాంకే పద్మ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలు పాఠశాలల్లో ప్రచార పత్రాలను విడుదల చేశారు.