జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను తెలంగాణ చౌక్‌లో బుధవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకుడు కందుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జంగ మహేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, గాలిపెల్లి కుమార్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పవన్ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తామని నేతలు తెలిపారు.