ఎమ్మిగూరులో 40 మంది లబ్ధిదారులకు 19.53 లక్షల రూపాయల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పంపిణీ చేశారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో 393 మందికి 3.08 కోట్ల రూపాయల సాయం అందించినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో భార్యను కోల్పోయిన బోయ కేశన్నకు 5 లక్షల రూపాయల టీడీపీ సభ్యత్వ క్లెయిమ్ లెటర్ అందజేశారు.