విద్యార్థులకు షూస్, సాక్స్ పంపిణీ
NEWS Sep 03,2026 04:18 pm
మేడిపల్లి: వల్లంపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో ప్రభుత్వ పథకంలో భాగంగా విద్యార్థులకు ఉచితంగా షూస్, సాక్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ లక్ష్మీనరసయ్య, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ పాల్గొని విద్యార్థులకు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా వసతులు కల్పిస్తున్నామని, విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకుని బాగా చదువుకోవాలని వారు సూచించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.