జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా అవార్డు అందుకున్న నునావత్ రాజు
NEWS Sep 03,2026 03:39 pm
కోరుట్ల: గడి ప్రాథమిక పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల సంఖ్య పెంపు, నాణ్యమైన విద్య కోసం చేసిన కృషికి గుర్తింపుగా నునావత్ రాజుకు తపస్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా అవార్డు అందించారు. ఈ సందర్బంగా ఆనందం వ్యక్తం చేసిన నునావత్ రాజు.. ఈ అవార్డు ఎంపిక చేసి సత్కరించిన తపాస్ జిల్లా శాఖకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు మరింత బాధ్యతతో పనిచేయాలనే స్ఫూర్తిని అందించిందన్నారు.