భద్రాచలం: శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. కొనసాగుతున్న పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా పనులను వేగంగా, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఆలయ అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.