కొత్తగూడెం మండలం రామాంజనేయ కాలనీ పంచాయతీ పరిధిలోని రజక కాలనీ ప్రజలు తహసీల్దార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. 137/1 సర్వే నంబర్‌లోని కాలనీలో చాలాకాలంగా నివసిస్తున్నా ఇళ్లకు నంబర్లు లేక ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అధికారిక సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఇంటి నంబర్లు కేటాయించి సమస్య పరిష్కరించాలని కోరగా, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హామీ ఇచ్చారు.