యలమంచిలిలో వైఎస్సార్సీపీ సమావేశం
NEWS Sep 28,2026 01:33 pm
యలమంచిలి పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ అధ్యక్షతన మున్సిపల్ ఎన్నికల ఆశావహ అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. వార్డుల వారీగా అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. మాజీ మంత్రి కురసాల కన్నబాబు, జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, పరిశీలకులు శోభా హైమావతి, కోలా గురువులు పాల్గొన్నారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని బొడ్డేడ ప్రసాద్ పిలుపునిచ్చారు.