ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటర్ల నమోదు!
NEWS Sep 28,2026 01:33 pm
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్, వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ MLC స్థానాల ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభం అయింది. ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. 2026 నవంబర్ 1 వరకు డిగ్రీ పూర్తి చేసిన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చు. పాత ఓటర్లు కూడా ఫారం-18 నింపాలి. https://ceotelangana.nic.in లో ఫారాన్ని సమర్పించవచ్చు. నవంబర్ 6 లోపు ఓటర్ల నమోదుకు అవకాశం ఉంది. నవంబర్ 25న డ్రాఫ్ట్, డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తారు.