కొత్త విద్యుత్ స్తంభం ఏర్పాటు
NEWS Sep 29,2026 11:06 pm
నర్సాపూర్ జి మండలం టేంబుర్ని గ్రామంలోని ఓ కాలనీలో పాడైన విద్యుత్ స్తంభంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ లలిత శ్రీధర్‌రెడ్డి వెంటనే స్పందించి, సంబంధిత విద్యుత్ అధికారులకు నూతన స్తంభం ఏర్పాటు చేయాలని సూచించారు. దీంతో విద్యుత్ అధికారులు పాడైన స్తంభం స్థానంలో కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేసి, విద్యుత్ తీగలను సరిచేశారు. దీంతో ప్రమాదం తప్పిందని, కొత్త స్తంభం ఏర్పాటుతో తమకు సౌకర్యంగా ఉందని కాలనీ వాసులు తెలిపారు. సమస్యను పరిష్కరించిన సర్పంచ్ లలిత శ్రీధర్‌రెడ్డికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.