రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
NEWS Sep 29,2026 11:07 pm
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు ధర్నా నిర్వహించారు. 50 ఏళ్లుగా సాగు చేస్తున్న భూములకు పట్టా పాస్‌బుక్కులు ఇవ్వకపోవడంతో ప్రభుత్వ పథకాలు, రుణాలు అందడం లేదని తెలిపారు. సమస్య పరిష్కారానికి కొట్నబిల్లి రెవెన్యూ గ్రామంలో ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే.గోవిందరావు, గోర పెద్దిరాజు, అరిగిల బోడయ్య తదితరులు పాల్గొన్నారు.