అద్దిపల్లివారి కల్లాలకు సీసీ రోడ్డు
NEWS Oct 01,2026 06:02 pm
కేపీ అగ్రహారం గ్రామంలోని అద్దిపల్లివారి కల్లాల ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.25 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు, విశాఖ డెయిరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణ చొరవతో నిధులు మంజూరైనట్లు గ్రామ టీడీపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీను, మాజీ ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు దేవర అప్పారావు తెలిపారు. రోడ్డు నిర్మాణంతో వర్షాకాలంలో ప్రజల ఇబ్బందులు తొలగుతాయని పేర్కొన్నారు. పనులను త్వరగా ప్రారంభించి నాణ్యతతో పూర్తి చేయాలని కోరారు.