మహాత్ముడికి మోదీ నివాళులు
NEWS Oct 02,2026 10:22 am
దిల్లీ: గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ రాజ్‌ఘాట్‌ను సందర్శించి పుష్పాంజలి ఘటించారు. బాపూజీ సేవలను, ఆయన అనుసరించిన శాంతి, అహింసా మార్గాలను ప్రధాని గుర్తుచేసుకున్నారు. ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు రాజ్‌ఘాట్‌ను సందర్శించి నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ గాంధీ జయంతి వేడుకలు, స్వచ్ఛ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. మరోవైపు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రధాని, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.