ఆస్పత్రి వద్ద పేదలకు అన్నదానం
NEWS Oct 04,2026 11:00 am
HYD: బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద రెడీ టూ సర్వ్ ఫౌండేషన్, నవదీప ఫౌండేషన్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆస్పత్రి వద్ద చికిత్స కోసం వచ్చిన పేద రోగులు, వారి కుటుంబ సభ్యులు, అన్నార్తు లకు 300 మందికి ఉచితంగా భోజనం పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమంలో పలువురు స్వచ్చందంగా వాలంటీర్లుగా పాల్గొని, స్వయంగా ఆహారం పంపిణీ చేశారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలనుకునే దాతలు, స్వచ్ఛంద సేవకులు తమను సంప్రదించాలని కోరారు.