పుస్తకాలు పంపిణీ చేసిన నందనం అకాడమీ
NEWS Oct 05,2026 06:41 pm
నందనం అకాడమీ వ్యవస్థాపకులు డాక్టర్ పత్తిపాటి వివేక్ చౌదరి ఆధ్వర్యంలో పవిత్రమైన శ్రీవేంకటేశ్వర స్వామి వారి 3వ శనివారం పర్వదినాన్ని పురస్కరించుకుని కరకంబాడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు 300 అట్లాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. నందనం అకాడమీ అధినేత డా. వివేక్ పత్తిపాటి మాట్లాడుతూ "పిల్లలకు అట్లాస్ పుస్తకం అనేది కేవలం పుస్తకం కాదు, ప్రపంచాన్ని చూసే కిటికీ అని పేర్కొన్నారు. నేటి పోటీ ప్రపంచంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఏ విధంగా వెనక పడకూడదనే ఉద్దేశంతో ఈ చిన్న ప్రయత్నం చేసామన్నారు.