ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు హనుమకొండలో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల సంయుక్త ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర నిర్వహించారు. యాత్రలో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియలో ప్రజల్లో అనుమానాలు తలెత్తేలా వ్యవహరించే ఎలాంటి చర్యలనైనా తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉందన్నారు.