కల్పవృక్ష వాహనంపై బకాసుర వధ
అలంకారంలో మలయప్పస్వామి దర్శనం
NEWS Oct 15,2026 08:38 pm
తిరుమల: బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన గురువారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఉభయదేవేరులతో కలిసి బకాసుర వధ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. గజరాజుల ముందు నడక, మంగళవాయిద్యాల నాదం, భక్తుల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ప్రబంధ పారాయణం నడుమ వాహనసేవ వైభవంగా సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారి కృపాకటాక్షాలు పొందారు.