గరుడ వాహన సేవకు భారీ పోలీసు బందోబస్తు
NEWS Oct 15,2026 09:53 pm
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన గరుడ వాహన సేవ శుక్రవారం నిర్వహించనున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో భక్తుల రాకపోకలు సజావుగా సాగేందుకు, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. గరుడ వాహన సేవకు వచ్చే భక్తులు తమ వాహనాలను కేటాయించిన పార్కింగ్ ప్రాంతాల్లోనే నిలిపి ఉంచాలని సూచించారు. పోలీసు శాఖకు భక్తులు సహకరించాలని ఎస్పీ కోరారు.