దుబాయ్లో శారదకు ఘన సన్మానం
NEWS Oct 16,2026 11:28 pm
దుబాయ్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా దుబాయ్లో నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదను దుబాయ్ కాంగ్రెస్ పార్టీ ఎన్నారై సెల్ కన్వీనర్, ఆల్ రిసా గ్రూప్ చైర్మన్ పల్లె బాల్రాజ్ గౌడ్ దంపతులు మర్యాదపూర్వకంగా సన్మానించారు. ఈ సందర్భంగా శారదకు ఆత్మీయ స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.