గిద్దలూరులో ఎమ్మెల్యే సోదరుడి నామినేషన్
NEWS Oct 18,2026 09:36 am
గిద్దలూరు: మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు ఆదివారం చివరి రోజు కావడంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. చైర్మన్ సీటును టీడీపీకి కేటాయించకపోవడంతో ఎమ్మెల్యే సోదరుడు కృష్ణ కిషోర్ నామినేషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. ఆయన నామినేషన్ నిర్ణయంతో గిద్దలూరు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఇప్పటికే వివిధ పార్టీలు తమ అభ్యర్థులను రంగంలోకి దించుతున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. కృష్ణ కిషోర్ నామినేషన్ దాఖలు చేస్తారా, ఈ పరిణామం స్థానిక రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తిగా మారింది.