www.breakingnow.app | Sat, 21 Nov 2026
LATEST NEWS Telangana, Hyderabad

నాగార్జున‌పై సీఎం రేవంత్ ప్ర‌శంస‌లు

Share:
128 Views
నాగార్జున‌పై సీఎం రేవంత్ ప్ర‌శంస‌లు

తమ్మిడికుంట చెరువు అభివృద్ధికి రెండెకరాల భూమిని ఇచ్చిన నాగార్జున నిజ జీవితంలోనూ హీరోలాంటి నిర్ణయం తీసుకున్నారని సీఎం రేవంత్‌ ప్రశంసించారు. మాదాపూర్‌లో పునరుద్ధరించిన తమ్మిడికుంట చెరువును నాగార్జునతో కలిసి సీఎం ప్రారంభించారు. రూ.20 కోట్లతో చేపట్టిన పనుల్లో భాగంగా చెరువును 14 నుంచి 30 ఎకరాలకు విస్తరించారు. చుట్టూ 1.6 కిలోమీటర్ల నడకదారి, ఓపెన్‌ జిమ్‌, పిల్లల ఆటస్థలం ఏర్పాటు చేశారు. చెరువు అభివృద్ధికి సహకరించిన నాగార్జునను సీఎం సత్కరించారు. నాగార్జున మాట్లాడుతూ ప్రకృతిని భావితరాలకు అందించే ఆస్తిగా కాపాడాలని, తమ్మిడికుంట వద్ద సినిమా షూటింగ్‌ చేస్తానని తెలిపారు. HYDRA కమిషనర్‌ రంగనాథ్‌ అభివృద్ధి పనుల వివరాలను వివరించారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.