ఓ వైపు ప్రభుత్వ సేవలు చేస్తూ మరో వైపు సమాజానికి సేవ చేస్తున్న గాయక్వాడ్ తులసీదాస్ మాంగ్ కు 2024 తెలంగాణ ఐకాన్ అవార్డ్ వరించింది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖా సౌజన్యంతో తెలంగాణ వాయిస్ స్టూడియో, తెలంగాణ థియేటర్, మీడియా రిపేరిటరీ ఆధ్వర్యంలో బిగ్ రీల్స్ సినిమా వార పత్రిక 25 వ సంచిక విడుదల సందర్బంగా రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖా డైరెక్టర్ మామిడి హరికృష్ణ చేతుల మీదుగా గాయక్వాడ్ తులసీదాస్ మాంగ్ కి తెలంగాణ ఐకాన్ అవార్డ్స్ 2024 పురస్కారాన్ని ప్రధానం చేసి ఘనంగా సన్మానించారు.