28న గద్దర్ గాన స్మరణ సభ
NEWS Aug 24,2024 06:59 am
ఈ నెల 28న సూర్యాపేట శుభమస్తు హల్ లో జరుగబోయే గద్దర్ గాన స్మరణ సభను విజయ వంతం చేయాలని తెలంగాణ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి అనంతుల మధు పిలుపుని చ్చారు. సూర్యాపేటలోని తెలంగాణ యువజన సంఘం జిల్లా కార్యాలయంలో ఏపూరి సోమన్నతో కలిసి సభ వాల్ పోస్టర్ విడుదల చేశారు. ఉపాధ్య క్షులు రహమాత్ పాషా, అధికార ప్రతినిధి సంతోష్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు విప్లవ్ కుమార్, ప్రజాసంఘా ల నాయకులు ఉపేందర్, సునీల్ సురేష్, సందీప్, వెంకటేష్, నగేష్ పాల్గొన్నారు.