పి.గన్నవరంలోని పంచాయతీ రోడ్డులో ఉన్న సురక్షిత మంచినీటి ట్యాంకు శిథిలావస్థకు చేరుకుంది. ఈ మేరకు ట్యాంక్‌కు సంబంధించిన స్తంభాలు పెచ్చులూడి పడిపోయి స్తంభాలలో ఉన్న ఇనుప ఊచలు కూడా బయటకు వచ్చేసి ప్రమాదకర పరిస్థితులలో ఈ ట్యాంకు ఉంది. ఏ క్షణాన ఏ ప్రమాదం సంభవిస్తుందోనని స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ ట్యాంకుకు ప్రధాన రహదారి ఉండడం, సమీపంలో కళాశాలలు ఉండడం ప్రజలను మరింత భయపెడుతోంది.