అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం హుక్కంపేట మండలంలోనిం పెదగరువు ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఉపాధ్యాయులు అందిస్తున్న విద్యా బోధనను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని, విద్యతోనే జీవితాల్లో మార్పు వస్తుందని అన్నారు. మెనూ సక్రమంగా అమలు చేయాలని పాఠశాల సిబ్బందికి తెలిపారు.