విద్యా సంస్థల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సూరిబాబు డిమాండ్ చేశారు. పెద్దాపురం మండలం చందలాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నెల వ్యవధిలో ముగ్గురు విద్యార్థులు మరణించడంపై భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా బృందం సర్వే చేసి మరణాలకి కారణం తెలుసుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ.. జిల్లాలో ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు.