31న రాజానగరంలో రక్తదాన శిబిరం: ఎమ్మెల్యే
NEWS Aug 27,2024 05:37 pm
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని ఈనెల 31న రాజానగరంలోని రాయల్ కన్వెన్షన్ నందు మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణ తెలిపారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.