గ్రేడ్-1 వీఆర్వోలకు సీనియర్ సహాయకులుగా పదోన్నతి కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం డిమాండ్ చేసింది. ప్రస్తుతం కాకినాడ జిల్లాలో 47 మందికి గాను 17 మంది వివిధ కారణాల వల్ల సంబంధిత శాఖ పరీక్షలు రాయలేకపోయారని రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రరాజు తెలిపారు. ఈ మేరకు వారు కలెక్టర్‌ను కలిసేందుకు వచ్చారు.