కాకినాడ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కాకినాడ టౌన్ పరిధిలో మంగళవారం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. 24 కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. స్పెషల్ జుడీషియల్ 3వ క్లాస్ మెజిస్ట్రేట్ నరసింహారావు ఎదుటి వారిని హాజరుపరచామన్నారు. వారిలో 12 మందికి రెండు రోజుల వంతున జైలు శిక్ష విధించారన్నారు. మరో 12 మందికి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించారని తెలిపారు.