పశువులను రహదారులపై వదిలితే వాటి యజమానులపై కఠిన చర్యలు చూసుకుంటామని
హిందూపురం మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. హిందూపురం మున్సిపాలిటీ పరిధిలో
పశువులు రహదారులపైకి రావడం వల్ల ప్రమాదాల జరుగుతున్నాయని, యజమానులు పశువులను
ఇంటి వద్ద ఉంచుకోవాలని హెచ్చరిస్తూ మున్సిపాలిటీ వాహనం ద్వారా అధికారులతో ప్రచారం నిర్వహించారు. పశువులను రహదారులపైకి వదిలితే వాటిని స్వాధీనం చేసుకుంటామన్నారు.