చంద్రబాబుకు జగన్ బహిరంగ లేఖ
NEWS Aug 27,2024 05:31 pm
రాష్ట్రంలో ప్రజారోగ్య రంగానికి మీ ప్రభుత్వం ఉరితాడు బిగిస్తోంది అంటూ వైసీపీ అధ్యక్షుడు జగన్ సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. సామాన్యులకు నాణ్యమైన వైద్యం అందకుండా చేస్తున్నారని, బిల్లులు చెల్లించకుండా ఆరోగ్యశ్రీని నీరుగారుస్తున్నారని, తద్వారా ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం తిరిగి ఆస్తులు అమ్ముకునే పరిస్థితిని తీసుకువస్తున్నారని మండిపడ్డారు.