గోదావరి పుష్కరాలకు ఉత్తర్వులు జారీ
NEWS Jun 26,2025 04:20 am
2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. 12 మంది మంత్రులతో కూడిన ఈ ఉపసంఘం (కమిటీ) ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.