ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
NEWS Oct 06,2026 11:18 pm
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. సిడిఎంఏ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ అత్యంత కీలకమైనదని తెలిపారు ఎవరికీ కేటాయించిన విధులను వారు పారదర్శకంగా నిబంధనతో విధులు నిర్వహించాలని ,అధికారులు సిబ్బంది ఒకరినొకరు సమన్వయం చేసుకుంటూ చక్కగా పనిచేయాలని ,విధుల్లో ఎవరు పొరపాటు చేసినా శాఖ పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు