రోజువారి లక్ష్యాన్ని నిర్దేశించుకుని సర్వే చేపట్టాలి
NEWS Oct 06,2026 11:17 pm
భూముల రీసర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా ఆదనపు కలెక్టర్ అండ్ రవి అధికారులను ఆదేశించారు. హనుమకొండ జిల్లా ఎలకతుర్తి మండలంలోని పలు గ్రామాలలో చేపడుతున్న భూ రిసర్వే ప్రక్రియను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఇరు గ్రామాల రైతులతో రీసర్వే జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.ప్రతిరోజు 70 ఎకరాల కొలత లక్ష్యంగా నిర్దేశించుకుని భూముల కొలతలను సర్వేయర్లు పూర్తి చేయాలన్నారు.భూముల రిసర్వేలో భాగంగా రెండు రోవర్లను వినియోగిస్తూ సర్వే పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.