ధర్మపురి: దేవుడి దర్శనం దారి గతుకులమయం
NEWS Aug 07,2025 12:00 am
ధర్మపురి నంది కూడలి నుండి శ్రీ లక్ష్మీ నరసింహ దేవస్థానంకి వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. వర్షాలకు అడుగడుగునా గుంతలు పడి నీరు నిలిచింది. నిత్యం వేలాది మంది భక్తులు వస్తుండగా వాహనాలలో కాలినడకన వచ్చేవారు సైతం ఇబ్బంది పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి తాత్కాలికగా మరమ్మతులు చేపించాలని బుధవారం స్థానికులు కోరుతున్నారు.