రైతులకు సమృద్దిగా యూరియా పంపిణీ
NEWS Sep 03,2025 04:12 pm
పినపాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయంలో రైతులకు యూరియా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందిస్తూనే ఉన్నామని తెలిపారు సీఈఓ సునీల్ కుమార్. బుధవారం ఆయన పినపాక మండలం ఈ.బయ్యారం క్రాస్ రోడ్ లో సహకార సంఘం కార్యాలయం వద్ద మాట్లాడారు. గోడౌన్లో నిలువ ఉన్న ప్రకారం యూరియా అందిస్తూనే ఉన్నామని తెలిపారు. ఇప్పటికే వంద బస్తాల యూరియా రైతులకు ఇచ్చామన్నారు. రైతులను ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశం కాదన్నారు.