తెలుగు యూనివర్సిటీ అందించే పురస్కారాల్లో సిరిసిల్ల జిల్లా భీముని మల్లారెడ్డిపేట వాసులు 5 పురస్కారాలు అందుకున్నారు. ప్రముఖ కథా రచయిత పెద్దింటి అశోక్ కుమార్ 2005లో సాహిత్యకారుడిగా కీర్తి పురస్కారం, 2012లో కథా రచయితగా ప్రతిభా పురస్కారం, 2016లో నవలా రచయితగా ప్రతిభా పురస్కారం 3సార్లు (హ్యాట్రిక్) పొందారు. బాల సాహిత్యంలో 2022లో గరిపెల్లి అశోక్ కీర్తి పురస్కారం పొందారు. తాజాగా ఉత్తమ ఉపాధ్యాయ కీర్తి పురస్కారం పాతూరి మహేందర్ రెడ్డి దక్కించుకున్నారు. 5 అవార్డులు రావడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.