సడన్ షాక్ ఇచ్చిన బంగారం ధర!
NEWS Mar 07,2026 11:45 am
కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర నేడు భారీగా పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.2,510 పెరిగి రూ.1,63,640కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.2,300 ఎగబాకి రూ.1,50,000 కు చేరింది. కిలో వెండి ధర రూ.2,90,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ధరలు స్వల్ప తేడాలుండొచ్చు.