Logo
Download our app
ఈ అమ్మాయిలు నిజం కాదు: సజ్జనార్‌
NEWS   Mar 18,2026 12:02 am
యువత ఒంటరితనాన్ని లక్ష్యంగా చేసుకుని సైబర్ కేటుగాళ్లు హనీట్రాప్ మోసాలకు పాల్పడుతున్నారని పోలీసు క‌మీష‌న‌ర్ స‌జ్జ‌నార్ హెచ్చరించారు. ఆకర్షణీయ వీడియోల పేరుతో వచ్చే యాప్‌లు AIతో రూపొందించిన మోసమని తెలిపారు. వాటిని ఇన్‌స్టాల్ చేస్తే ఫోన్ డేటా దొంగిలించి, వీడియో కాల్‌ల ద్వారా సెక్స్‌టార్షన్‌కు గురిచేస్తారని చెప్పారు. ఇలాంటి యాడ్స్‌కు మోసపోవద్దని, బాధితులు వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని సూచించారు.
⚠️ You are not allowed to copy content or view source