మంత్రి పదవికి డెడ్‌లైన్ గండం!
NEWS Mar 20,2026 10:24 am
తెలంగాణ మంత్రి అజహరుద్దీన్‌కు ఏప్రిల్ ఆఖరుతో 6 నెలల గడువు ముగుస్తుంది. ప్రభుత్వం పంపిన MLC సిఫార్సును గవర్నర్ ఇంకా ఆమోదించకపోవడంతో ఆయన పదవిపై సందిగ్ధం నెలకొంది. నిబంధనల ప్రకారం ఆలోగా సభ్యత్వం పొందకుంటే రాజీనామా తప్పదు. మరోవైపు గవర్నర్ నిర్ణయంపై సుప్రీంకోర్టు స్పందిస్తూ హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించడంతో ఇప్పుడు అందరి దృష్టి కోర్టుపైనే ఉంది.