Logo
Download our app
మానవత్వం చాటుకున్న యువకుడు
NEWS   Mar 23,2026 01:36 pm
పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రూ.32 వేల విలువ గల మొబైల్ ఫోన్ ను పోగొట్టుకున్నాడు. అటు వైపు వెళ్తున్న అడ్డూరి సంతోష్ కు మంథని రహదారిపై ఆదివారం మొబైల్ దొరికింది. దీంతో బాధితుడు తన మొబైల్ కు ఫోన్ చేయగా సంతోష్ ఫోన్ లిఫ్ట్ చేసి తన వద్ద ఉందని పేర్కొంటూ శ్రీనివాస్ రాగానే మానవతా దృక్పథంతో మొబైల్ ను అప్పగించారు. పోయిన వస్తువు తిరిగి దొరకటం చాలా అరుదు. సంతోష్ స్పందించి మొబైల్ అందించినందుకు పలువురు అభినందించారు. బాధితుడు మొబైల్ అందించిన సంతోష్ కు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source