టెక్స్‌టైల్ రాజధానిగా తెలంగాణ: సీఎం
NEWS Apr 03,2026 12:07 pm
HYD: 13వ ATEXCON 2026లో CM రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, 2047 నాటికి తెలంగాణను దక్షిణాసియాలో అగ్రగామి టెక్స్‌టైల్ కేంద్రంగా తీ ర్చిదిద్దుతామని తెలిపారు. వస్త్ర పరిశ్రమ తెలం గాణ DNAలో భాగమని, పోచంపల్లి ఇక్కత్, గద్వాల చీరలు, వరంగల్ దుర్రీస్ వంటి చేనేత వైభవాన్ని ప్రస్తావించారు. వరంగల్ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌తో పాటు పరిశ్రమలకు భూమి, విద్యుత్, నీటి సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. గ్రీన్ టెక్స్‌టైల్ హబ్‌ల అభివృద్ధి, మహిళలకు శిక్షణ ద్వారా ఉపాధి కల్పిస్తామన్నారు.