Logo
Download our app
41 అంశాలను ఆమోదించిన AP క్యాబినెట్!
NEWS   Apr 30,2026 07:04 pm
ఏపీ సీఎం చంద్ర‌బాబు అధ్యక్షతన గురువారం జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో వివిధ శాఖలకు సంబంధించిన మొత్తం 41 కీలక నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సమావేశం అనంతరం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో హోంశాఖ, న్యాయశాఖ, పంచాయతీరాజ్, పరిశ్రమలు, పురపాలక, జలవనరులు, రెవెన్యూ తదితర శాఖలకు సంబంధించిన ముఖ్యమైన ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ముఖ్య నిర్ణయాలు ఇలా ఉన్నాయి 23 ఏళ్లుగా పదోన్నతులు లేకుండా పనిచేస్తున్న 385 మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతులు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు న్యాయ విభాగంలో 21 కొత్త పోస్టుల సృష్టి ఢిల్లీలో రూ.124.5 కోట్లతో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి ఆమోదం అమరావతి అభివృద్ధి పనులకు భారీ నిధుల కేటాయింపు సెక్రటేరియట్, హెచ్‌ఓడీ టవర్లకు రూ.2540 కోట్లు క్వాంటం టవర్స్ నిర్మాణానికి రూ.1208 కోట్లు అసెంబ్లీ సెంట్రల్ స్పైర్ నిర్మాణానికి రూ.798 కోట్లు కృష్ణా కరకట్ట బలోపేతానికి రూ.443 కోట్ల సవరించిన అంచనాలకు ఆమోదం పోలవరం నిర్వాసితుల ఇళ్ల నిర్మాణానికి యూనిట్ ధరను రూ.3.57 లక్షలకు పెంపు ఆర్ & ఆర్ కాలనీ వెలుపల ఇల్లు నిర్మించుకునే వారికి హౌస్‌సైట్ సాయం రూ.2 లక్షలకు పెంపు రామాయపట్నం గ్రీన్‌ఫీల్డ్ పోర్టు అదనపు పనులకు రూ.354.23 కోట్ల పరిపాలన అనుమతి డిస్కంలు తీసుకునే రూ.7000 కోట్ల రుణానికి ప్రభుత్వ గ్యారెంటీ పొడిగింపు ఇకపోతే, పలు విద్యాసంస్థలు, పరిశ్రమలు, క్రీడా మౌలిక వసతులు, ఫిషింగ్ హార్బర్లు, ఇండస్ట్రియల్ హబ్‌లు, డిఫెన్స్ పరిశ్రమల కోసం వందల ఎకరాల భూమి కేటాయింపులకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

⚠️ You are not allowed to copy content or view source