Logo
Download our app
గుండు చేయించుకుంటే గుర్తించని యాప్
NEWS   May 29,2026 01:43 pm
ఉపాధి హామీ పథకంలో హాజరు నమోదుకు కొత్తగా తీసుకొచ్చిన ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌లో లోపాలు బయటపడుతున్నాయి. ఓ కూలీ గుండు చేయించుకుని ఉపాధి పనులకు వెళ్లగా.. మొబైల్ సాఫ్ట్‌వేర్ అతడి ముఖాన్ని గుర్తించలేదు. ఎంతసేపటికీ ఫేస్ రికగ్నిషన్ కాకపోవడంతో.. చివరకు పక్కనే ఉన్న మహిళ జుట్టును తలపై కప్పి ఫొటో దిగిడంతో యాప్ అటెండెన్స్‌ను అంగీకరించింది. మహబూబాబాద్ జిల్లా కోమటిపల్లి (ఇనుగుర్తి)కి చెందిన మల్యాల శ్రీను కొండగట్టు అంజన్నని దర్శించుకుని తలనీలాలు సమర్పించాడు. గురువారం ఉపాధి పనులకు వెళ్లగా.. హాజరు సమయంలో నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ అతని ముఖాన్ని గుర్తించలేదు. పలుమార్లు ప్రయత్నించినా హాజరు నమోదు కాకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డాడు. దీంతో నల్లటి బొగ్గుతో గడ్డం, మీసాలు దిద్దుకుని.. తలపై వెంట్రుకలు ఉన్నట్లు ఓ మహిళ జుట్టును పెట్టుకోగా.. యాప్ గుర్తించింది.

Top News

LATEST NEWS   Jul 31,2026 05:25 pm
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి సస్పెన్షన్
ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెలువడింది. ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఏయూ పాలకవర్గం సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విజిలెన్స్,...

LATEST NEWS   Jul 31,2026 02:24 pm
నేటితో ముగియనున్న ఐటీఆర్ గడువు
2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయడానికి చాలా మంది పన్ను చెల్లింపుదారులకు జూలై 31) చివరి తేదీ. గడువులోగా రిటర్న్స్...

LATEST NEWS   Jul 31,2026 02:19 pm
కడెం పరిసరాల్లో అప్రమత్తతకు కలెక్టర్ ఆదేశం
నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. ప్రాజెక్టును సందర్శించి నీటి...

⚠️ You are not allowed to copy content or view source