తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
NEWS Jun 02,2026 02:02 pm
బహ్రెయిన్ ఎన్నారై బీఆర్ఎస్ సెల్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అండాలస్ గార్డెన్‌లో జరిగిన కార్యక్రమానికి ఎన్నారై బీఆర్ఎస్ శాఖ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ అధ్యక్షత వహించారు. కేక్ కట్ చేసి సభ్యులు 6 దశాబ్దాల పాటు తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు అహింసా మార్గంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేసి, ప్రాణాలకు తెగించి రాష్ట్ర సాధనకు కృషి చేసిన కేసీఆర్ సేవలను స్మరించారు. బహ్రెయిన్ బీఆర్ఎస్ కార్యకర్తలు, తెలంగాణ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.