పాఠశాలలకు మరమ్మతులు చేపట్టాలి
NEWS Jun 13,2026 03:05 pm
భద్రాద్రి జిల్లాలోని పలువురు ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయని బిఆర్ఎస్ విద్యార్థి విభాగం పాల్వంచ పట్టణ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో భవనాలకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని కోరుతూ అదనపు కలెక్టర్ విద్యా చందనకు వినతిపత్రం అందజేశారు. ప్రైవేట్ పాఠశాలల అధిక ఫీజుల వసూళ్లను అరికట్టాలని డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు పాల్గొన్నారు.