జూలై 16 నుంచి ఆషాడ బోనాలు
NEWS Jul 10,2026 04:09 pm
హైదరాబాద్‌లో ఏటా నిర్వహించే ఆషాడ బోనాల ఉత్సవాలు ఇక్కడి గంగా జమున తెహజీబ్ ప్రత్యేకతను చాటుతాయని మంత్రి కొండా సురేఖ అన్నారు. బోనాల ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు మంత్రి సురేఖ దిశానిర్దేశం చేశారు. జూలై 16 నుంచి ప్రారంభమయ్యే ఆషాడ బోనాల ఉత్సవాల్లో తొలి బోనం గోల్కొండ జగదాంబికా మహంకాళి అమ్మవారికి సమర్పించడం ఆనయితీగా వస్తున్నదని, జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు జరిగే గోల్కొండ బోనాల ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు సంపూర్ణ సమన్వయంతో పనిచేసి, పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.