మాజీ మంత్రి కారుమూరికి షాక్
NEWS Jul 29,2026 02:20 pm
మద్యం అక్రమ రవాణా కేసులో మాజీ మంత్రి కారుమూరికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మద్యం రవాణాకి సంబంధించి ఈడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సీజేఐ ధర్మాసనం నిరాకరించింది. రూ.350 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు కనిపిస్తోందని సీజేఐ ధర్మాసనం పేర్కొంది. కస్టోడియల్ విచారణ అవసరమని సీజేఐ ధర్మాసనం అభిప్రాయపడింది. దీంతో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.