నేడు స్కూళ్లకు సెలవు: కలెక్టర్
NEWS Jul 30,2026 12:58 pm
నిర్మల్ జిల్లాలో 2 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెరువులు కుంటలు నీటితో నిండుతున్నాయి. రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి. భారీ వర్షాల కారణంగా స్కూల్ పిల్లల భద్రత దృష్ట్యా ఈరోజు జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా తెలిపారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.